Maha Surya Vandanam : గిరిజన బిడ్డలు ఏదైనా సాధిస్తారు అనడానికి ఇదే నిదర్శనం : మంత్రి సంధ్యారాణి
అరకులో 18 వేల మది విద్యార్థులతో ప్రపంచ రికార్డు సాధించేలా మహా సూర్యవందనం (Maha Surya Vandanam) పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. 18 వేల మంది విద్యార్థులతో 108 సార్లు సూర్య నమస్కారాలు చేయించారు. అరకు (Araku)లోని గిరిజన సంక్షేమ వసతి గృహం మైదానంలో ఈ మహా సూర్యవందనం కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రపంచ ఆర్యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సంధ్యా రాణి (sandhyarani) ప్రారంభించగా, ఐటీడీఏ (ITDA), గిరిజన విద్యాలయాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నమోదు చేసేందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి ఏలేసా రైనాడ్(Alessa Raynaud) వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో జరిగిన గొప్ప కార్యక్రమం ఇది. 5 మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు ఈ మహా సూర్యవందనంలో పాల్గొన్నారు. గిరిజన బిడ్డలు తలకుచుంటే ఏదైనా సాధిస్తారు అనడానికి ఇదే నిదర్శనం అని అన్నారు. అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ (Dinesh Kumar) మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో ఇది సాధ్యమైందన్నారు. గిరిజన విద్యార్థుల ఆరోగ్యానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థుల నిత్య జీవితంలో ఇది నిరంతర అభాస్యంగా నిలవాలన్నారు.













