వైభవంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ మాహా కుంభాభిషేకం
సుమారు 1100 సంవత్సరాల నుంచి కాణిపాకం లో భక్తులను అనుగ్రహిస్తున్న స్వయంభూ వినాయక స్వామి దేవాలయానికి ఈ రోజు, ఆదివారం, 21 ఆగస్ట్ 2022 న శాస్త్రోక్తంగా చతుర్వేద హవన సహిత మాహాకుంభాభిషేకం జరిగింది.
సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో పెరుగుతున్న భక్తుల సంఖ్య ను దృష్టి లో వుంచుకొని ఆలయ పునార్మాణ అనంతరం జరిగిన ఈ మహా కుంభాభిషేకానికి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి శ్రీ నారాయణ స్వామి, మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, శ్రీమతి రోజా, పార్ల మెంట్ సభ్యులు శ్రీ మిథున్ రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ హరి జవహర్ లాల్ లు పాల్గొన్నారు.
ఈ నిర్మాణ వ్యయం కి దాతలు అమెరికా నుంచి వచ్చిన శ్రీ శ్రీనివాస్ గుత్తికొండ, శ్రీ రవి ఐకా వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ హరి జవహల్ లాల్ మాట్లాడుతూ పాత ఆలయం పూర్తిగా పునార్మించామని, మూడంచెలుగా గర్భాలయం, అంతరాలయం, మహా మండపం నిర్మించామని, సుమారు 200 శిల్పులు దాదాపు 13 నెలలు శ్రమించి భారతీయ కళలు ఉట్టిపడేలా నిర్మాణం జరిగిందని తెలిపారు.
శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవస్థానం ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఎంవీ సురేష్ బాబు మాట్లాడుతూ ఈ మహా కుంభాభిషేక వేడుకలకు దాదాపు 50000 కు పైగా భక్తులు వచ్చారని, జిల్లా యంత్రాంగం తో కలిసి పూర్తి ఏర్పాట్లు చేశామని తెలిపారు.
ఇంతటి మహత్తర కార్యానికి మేము దాతలుగా వుండే అవకాశం రావటం మా అదృష్టం అని అమెరికా నుంచి వచ్చిన శ్రీ శ్రీనివాస్ గుత్తికొండ, శ్రీ రవి ఐకా అన్నారు.













