పవన్ తో టీడీపీ ఎమ్మెల్సీ భేటీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిల భేటీ కలకలం రేపుతోంది. ఒంగోలులోని బృందావన్ గార్డెన్లో పవన్ను శ్రీనివాసులరెడ్డి కలిశారు. ఈ కలయిక రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీనివాసుల రెడ్డి జనసేనలో చేరతారని ఆ పార్టీ తరపున ఎంపీ లేదంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ఇప్పటికే జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన వెళ్లి పవన్ను కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే చిరంజీవి కుటుంబంతో శ్రీనివాసులరెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయని, ఈ కారణంగానే ఆయన పవన్ను కలిశారని.. అనుచరులు చెబుతున్నారు.













