చంద్రబాబు తోనే ఏపీ మరింత అభివృద్ధి
చంద్రబాబుతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని రాజమండ్రి లోక్సభ టీడీపీ అభ్యర్థి మాగంటి రూప అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఏ నియోజకవర్గానికి వెళ్లినా అన్నదాతను ఆదుకున్న ఆపద్భాందవుడికే తమ ఓటని చెబుతున్నారన్నారు. మహిళలు అయితే చంద్రన్నకే తమ ఓటని చెబుతున్నారని పేర్కొన్నారు తాను ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆశీర్వదిస్తున్నారని వాళ్ల ఆశీర్వాదమే తమకు శ్రీరామ రక్షని అన్నారు. చంద్రబాబు కష్టానికి ఫలితంగా ప్రజలు ఈ విధంగా స్పందిస్తున్నారని అన్నారు. ఎక్కడికి వెళ్లినా పసుమయం కనిపిస్తుందని, అదే ప్రజల నాడని పేర్కొన్నారు.













