పాదయాత్రలో మాగంటి బాబు.. సంచలన వ్యాఖ్యలు
అమరావతే రాజధానిగా ఉండాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళడం వెనుక జగన్ మాస్టర్ ప్లాన్ ఉందని తెలుగుదేశం పార్టీ నేత మాగంటి బాటు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరు నెలల క్రితం కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడే అనుమానించానని తెలిపారు. దానిలో భాగంగానే హైకోర్టు తీర్పు ఇచ్చిన ఆరు నెలలకు సుప్రీంకోర్టుకు వెళ్ళారన్నారు. పాదయాత్ర చేస్తున్న వారిపై మంత్రుల వ్యాఖ్యలు సరికాదని మండిపడ్డారు. నేను కూడా మంత్రిగా చేసాను. మంత్రిగా ఎలా వ్యవహరించాలో వారు తెలుసుకోవాలి అని అన్నారు.













