వందే భారత్ ట్రైన్ ను భజన క్షేత్రంగా మార్చిన మాధవి లత.. నిజంగా ఇంత అవసరమా?
తిరుమలలో లడ్డు (Tirumala Laddu) విషయంలో సర్వత్ర ఎన్ని చర్చలు జరుగుతున్నాయో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఎందరో నేతలు తమకు తోచిన విధంగా ఈ విషయంపై స్పందిస్తున్నారు. అయితే తాజాగా బీజేపీ నేత మాధవి లత (Madhavi Latha)తిరుమల లడ్డు (Tirumala Laddu) విషయంలో స్పందించిన తీరు పలు ప్రశ్నలకు తావిస్తోంది. మాధవి లత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. హిందూ మతాన్ని తన అంతరాత్మగా చేసుకొని విచిత్రమైన ప్రవర్తనతో ఎప్పుడు ఏదో ఒక విషయంలో వైరల్ అవుతూనే ఉంటుంది.
ఇక శ్రీ వెంకటేశ్వర స్వామికి (Lord Venkateswara) జరిగిన అపచారాన్ని ప్రాయశ్చిత్తం అంటూ ఆమె తిరుమలకు పయనం అయ్యింది. పరమ పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదం అయిన లడ్డు (Srivari Laddu) తయారీలో ఉపయోగించే నేతిలో కల్తీ జరిగింది అన్న ఆరోపణ యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడిన చేసింది. అయితే ఈ విషయానికి రాజకీయ రంగు పులిమి లేనిపోని సమస్యలు తలెత్తేలా చేస్తున్నారు మన నేతలు. మరి ముఖ్యంగా ఈరోజు మాధవి లత ప్రవర్తన అదేవిధంగా ఉంది.
తిరుమలకు బయలుదేరిన మాధవి లత ఆమె అనుచరులతో కలిసి కాషాయ వస్త్రాలు ధరించి వందే భారత్ ట్రెయిన్ ఎక్కరు. ట్రైన్ లో వెళ్లడంలో తప్పులేదు ట్రైన్ లో ఆమె చేసిన పని కచ్చితంగా ప్రశ్నించే విధంగానే ఉంది. గోవింద నామ సంకీర్తన చేస్తూ భజన కార్యక్రమం నిర్వహిస్తూ ట్రైన్ లో మాధవి లత సృష్టించిన హడావిడి అంతా ఇంతా కాదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆయన ట్రైన్ లో అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు ప్రయాణిస్తారు. అలాంటి సమయంలో ఇటువంటి చర్యలు చేయడం ప్రస్తుతం ఉన్న సున్నిత పరిస్థితుల్లో ఎంతవరకు కరెక్ట్ అంటారు..
ప్రస్తుతం మాధవి లతకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లో దీనిపై పలు రకాలుగా స్పందిస్తున్నారు. రేపు నడక మార్గంలో తిరుమలకు చేరుకొని స్వామిని దర్శించనున్న మాధవి లత మార్గమధ్యంలో మరిన్ని వింత చేష్టలు చేస్తుందో చూడాలి. భక్తిని ఎవరి ఇష్ట ప్రకారం వాళ్లు ఆచరిస్తారు. కానీ ఇలా బలవంతంగా అందరిపై రుద్దేలా పబ్లిక్ లో ప్రవర్తించడం .. అది కూడా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నేతలకు సమంజసం కాదు.













