తెనాలిలో మాధవపెద్ది సత్యం శత జయంతి ఉత్సవాలు
శివ ఫౌండేషన్ మాధవపెద్ది మూర్తి గారి ఆధ్వర్యంలో ప్రఖ్యాత సినీ నేపధ్య గాయకుడు మాధవపెద్ది సత్యం గారి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నేడు మాధవపెద్ది పురస్కారం కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న రామినేని ఫౌండేషన్ కన్వీనర్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాగభూషణం గారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు సభాధ్యక్షులుగా, ముఖ్యఅతిథిగా మండలి బుద్ధ ప్రసాద్ గారు, గౌరవ అతిథిగా తానా మాజీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్ గారు రామినేని ఫౌండేషన్ చైర్మన్ ధర్మ ప్రచారక్ గారు పొత్తూరు రంగారావు గారు సినీనటి జయలలిత గారు Dr దక్షిణా మూర్తి గారు పాల్గొని మాధవపెద్ది పురస్కారాన్ని ప్రముఖ సినీ నేపధ్య గాయని ఎస్పీ శైలజ గారికి మరియు సినీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ గారికి అందజేసి వారిని సన్మానించారు.













