శాసన మండలి చైర్మన్ గా షరీఫ్ ఏకగ్రీవ ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్‌గా టీడీపీ సీనియర్ నేత, ప్రభుత్వ విప్ ఎం.ఎ.షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఒకే నామినేషన్ దాఖలు కావడంతో షరీఫ్ ఏకగీవ్రంగా ఎన్నికైనట్లు మండలి ఇన్ఛార్జ్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర నేతలు ఆయన్ను అభినందించి చైర్మన్ స్థానం వద్దకు తొడ్కొని వెళ్లారు. ఆ తర్వాత షరీఫ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. శాసనమండలి చైర్మన్‌గా షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. షరీఫ్‌తో తనకు మంచి అనుబంధం ఉందని అన్నారు. తను నమ్ముకున్న పార్టీ కోసం నమ్ముకున్న వ్యక్తిత్వం కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిలబడ్డారని గుర్తు చేశారు.













