LV Subramanyam: వారు ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారు : ఎల్వీ సుబ్రహ్మణ్యం
లడ్డూలో కల్తీ నెయ్యి కలపడం చాలా తప్పిదమని టీటీడీ (TTD) పూర్వ ఈవో, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం (LV Subramanyam) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో తప్పు చేసిన వారు ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారని మండిపడ్డారు. కల్తీ లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యి లేదు. హిందూవుల మనోభావాలు దెబ్బతింటే ఊరుకోరు. కల్తీ లడ్డూను రాజకీయం చేయకూడదు. టీటీడీ చైర్మన్ (TTD Chairman) పదవి అనేది సామాన్యమైనది కాదు. టీటీడీ ధర్మకర్తల మండలి భక్తిపూర్వకంగా వ్యవహరించాలి. నాణ్యత లేదని తెలిసీ నెయ్యిని అనుమతించిన వారు ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారు. ఉద్యోగులు (Employees) ఈ ఘటనతోనైనా మేల్కొని చైతన్యంతో పనిచేయాలి. ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా ఏం చేయాలో ఆలోచించాలి. పీఠాధిపతుల సూచనలను టీటీడీ తీసుకోవాలి అని సూచించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});













