కర్ణాటక ట్రైలరే… అసలు సినిమా 2019లో
తెలుగు ప్రజలు బీజేపీకి కర్ణాటక ఎన్నికల్లో ట్రైలర్ మాత్రమే చూపించారని, 2019 ఎన్నికల్లో సినిమా చూపిస్తారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు. ధర్మపోరాట సభలో లోకేశ్ ధర్మ పోరాటానికి మేం సిద్దం.. మీరు సిద్ధమా? అంటూ సభికులను ఉత్తేజపరుస్తూ ప్రసంగాన్ని ప్రారంభించారు. దొంగబ్బాయితో బీజేపీ రహస్య ఒప్పందం పెట్టుకుని మిత్ర ధర్మానికి వెన్ను పోటు పొడిచిందన్నారు. గ్రామాల్లో 16 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు వేయించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఇంత కష్టపడే వ్యక్తిని ప్రోత్సహించాల్సింది పోయి బీజేపీ నమ్మక ద్రోహం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 12 కేసుల్లో 420గా ఉన్న జగన్ వంటి నిందితుడితో బీజేపీ ముందుకెళుతోందంటే ఆలోచించాలని ప్రజలను కోరారు. ఏపీని స్కామ్ ఆంధ్రగా మర్చొద్దన్న మోదీ, ఇప్పుడు జగన్తో ఎలా ప్రయాణం చేస్తారని ప్రశ్నించారు.













