Yuvagalam: పాదయాత్ర పుస్తకం.. పవన్‌కు అందజేసిన లోకేశ్
యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అందజేశారు. క్యాబినెట్ భేటీ (Cabinet meeting) కి హాజరయ్యేందుకు సచివాలయాని (Secretariat )కి వచ్చిన పవన్‌ను లోకేశ్ కలిసి అందించారు. ఈ సందర్భం గా పవన్ మాట్లాడుతూ నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యం చేయడంలో యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) సఫలీకృతమైందన్నారు. నాటి అనుభవాలను కళ్లకు కట్టినట్లుగా పుస్తకరూపంలోకి తేవడంపై లోకేశ్‌ను ప్రశంసించారు. అరాచక పాలన అంతమై నేటికి ఏడాది పూర్తయిందని, గత ప్రభుత్వ పీడకలను ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదన్నారు. పాదయాత్ర నాటి అనుభవాలను పవన్‌తో లోకేశ్ పంచుకున్నారు.













