అధికారంలోకి వస్తే.. అన్ని తగ్గిస్తాం.. నారా లోకేష్
టీడీపీ నేత నారా లోకేష్ రాష్ట్రంలో పెట్రోల్ ,డీజిల్ ధరలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాన్యుడికి అందుబాటులో లేని విధంగా నాటి నాటికి ధరలు పెరిగిపోతున్నాయి అని లోకేష్ అన్నారు. తాము అధికారంలోకి వస్తే వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఇంటి పన్ను కూడా తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. నిర్మాణ రంగానికి అతి పెద్ద సమస్యగా ఉన్న ఇసుకకు సంబంధించి కూడా పాత విధానాన్ని తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ధరలు పెరిగాయే తప్ప అభివృద్ధి మాత్రం పెరగలేదని లోకేష్ అన్నారు. 5 సంవత్సరాల జగన్ పాలనలో 9 సార్లు పెరిగిన పెరుగుతున్న విద్యుత్ ధరల గురించి కూడా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.













