యువగళం పాదయాత్రకు బ్రేక్
మిగ్జాం తుపాను నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడిరచాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించినందున పాదయాత్రకు మూడు రోజుల విరామం ఇస్తున్నట్లు నేతలు తెలిపారు. ప్రస్తుతం కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి తీరంలో పొన్నాడ శీలంవారిపాకల వద్దకు యువగళం పాదయాత్ర చేరింది. తుపాను కారణంగా ఈ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో పాదయాత్రకు బ్రేక్ పడింది. తుపాను ప్రభావం తగ్గాక ఈ నెల 7న మళ్లీ శీలంవారిపాకల నుంచి యువగళం ప్రారంభించనున్నారు.













