తెలంగాణ నుంచి వచ్చిన వారికి.. మరో మూడేళ్లు
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకున్న వారికి విద్య, ఉద్యోగాలకు సంబంధించి మరో మూడు సంవత్సరాలు స్థానికత కల్పించేందుకు రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేసిన సవరణలకు అనుగుణంగా సాధారణ పరిపాలన శాఖ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన వారికి ఏడేళ్ళు స్థానికత కల్పిస్తూ 2014లోనే రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు చేస్తూ రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. ఆ గడువు పూర్తవడంతో మరో మూడేళ్లు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ నుంచి వచ్చి ఏ జిల్లాలోనైనా నివశిస్తున్న వారికి మరో మూడేళ్లు స్థానికతను వర్తిపంజేస్తు రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణల చేస్తూ రాష్ట్రపతి గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా విద్యా సంస్థల్లో ప్రవేశాలకు 1974 నాటి రాష్త్రపతి ఉత్తర్వుల్లో సవరణలు, ఉద్యోగాల స్థానికతకు సంబంధించిన 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణకు అనుగుణంగా సాధారణ పరిపాలన శాఖ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంపాయిమెంట్ సవరణలు చేస్తూ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ల్లో మరో మూడేళ్లు స్థానికత కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.













