Vidadala Rajani: పాపం అంతా ఎంపీదే.. మీడియా ముందుకు రజనీ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ.. మాజీ మంత్రి విడదల రజనీ(Vidadala Rajani) ఆరోపించారు. కావాలని చెప్పి నన్ను డిఫెం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. నాపై ఏసీబీ కేసు కట్టారని… ఈ కేసు లో ఫిర్యాదు చేసిన వ్యక్తులు ఎవరిని కనీసం ఒక్క రోజు కూడా కనీసం చూడలేదు.. వారితో మాట్లాడలేదన్నారు. ఏసీబీ కేసు నమోదు చేశారని విమర్శించారు. నాకు సంబంధం లేని కేసు నాపై పెట్టారు.. ఇది అంతా కూడా ఒక కట్టు కథ అంటూ కొట్టిపారేశారు.
ఫిర్యాదు చేసిన వ్యక్తి టిడిపి(TDP) వ్యక్తన్న రజనీ.. ఫిర్యాదు చేసిన వారి వెనుక ఒక డైరెక్టర్ ఉన్నారన్నారు. విడదల రజనీ పై కేసులు పెట్టడానికి స్క్రిప్ట్ అంత నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు నడిపిస్తున్నారన్నారు. ఎవరైతే నాపై ఫిర్యాదులు చేశారో వారికి అన్ని రకాల ఇల్లీగల్ పనులు చెయ్యించడానికి సహకారం అందిస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు గారికి తాను అంటే చాలా కోపమన్నారు రజనీ. 2020 వైసిపి అధికారంలో సెప్టెంబర్ 2 వైఎస్ఆర్ వర్ధంతి రోజు గురజాల డీఎస్పీ, సిఐ తో నా ఫోన్ నంబర్స్ కి కాల్ డేటా తీయించారు అన్నారు.
ఈ అంశాలు చెప్పే రోజు బయటకు చెప్పకూడదు అనుకున్న కానీ చెప్పేలా ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పై చెప్తూ ఎమోషనల్ అయిన విడుదల రజనీ.. ఒక మహిళకు సంబధించిన కాల్ డేటా తీసుకోవడం ఎలా ఉంటుంది అని కన్నీరు పెట్టుకున్నారు. మహిళ కాల్ డేటా తీస్తే ఎంత బాధ ఉంటుంది అనేది అందరికీ తెలుసన్నారు. నా కాల్ డేటా తీశారని మా పార్టీ లో పెద్దలకు అందరికీ తెలుసన్నారు. నేను ఈ అంశం జగన్ గారు సిఎం గా ఉన్నపుడు ఆయన దృష్టి కి తీసుకువెళ్లానని పేర్కొన్నారు. ఆ సమయంలో పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్డర్ చేశారని.. ఆ రోజు పోలీసు అధికారులు క్లియర్ గా చెప్పారు… ఎంపీ ఆదేశాలతోనే కాల్ డేట తీసినట్టు చెప్పారని వెల్లడించారు.













