రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న క్రీడా సంబరాలు : మంత్రి రోజా
రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న క్రీడా సంబరాలు పేరుతో ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖల మంత్రి ఆర్కే రోజా తెలిపారు. విజయవాడలోని శాప్ కార్యాలయంలో జగనన్న క్రీడా సంబురాలు లోగోను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ జగనన్న క్రీడా సంబరాలలో కబడ్డీ, వాలీబాల్, బ్మాడ్మింటన్, క్రికెట్ పోటీలను తొలుత నియోజకవర్గ, జిల్లా, జోన్ స్థాయిలో పూర్తి చేస్తామన్నారు. డిసెంబర్ 20, 21 తేదీల్లో రాష్ట్ర స్థాయి పోటీలు ఉంటాయన్నారు. విజేతలకు రూ.50 లక్షల విలువైన బహుమతులు అందజేస్తామన్నారు. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి, ఎండీ ఎన్.ప్రభాకర్, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి వాణిమోహన్ పాల్గొన్నారు.













