బొమ్మల తయారీపై దృష్టి….ఏపీ బొమ్మల తయారీ బోర్డు
ఆంధప్రదేశ్‌లో బొమ్మల తయారీ పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విశాఖ, గోదావరి జిల్లాలలో బొమ్మల తయారీ పరిశ్రమలకు పెద్దపీట వేయాలన్నారు. అందుబాటులో ఉన్న భూములను బట్టి ముందుగానే కొంత భూమిని ఉంచాలని ఆదేశించారు. ‘ఏపీ బొమ్మల తయారీ బోర్డు’ ఏర్పాటు చేయాలని మంత్రి మేకపాటి తెలిపారు. కడపలోని కొప్పర్తి కేంద్రంగా ఎమ్ఎస్ఎమ్ఈ పార్కు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. దీనిపై స్పందించిన పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది ఎమ్ఎస్ఎమ్ఈ యాదవపురంగా కేంద్రంగా అందుకు అనువైన చోటుందన్నారు.
కాగా ‘సోమశిల కాలువ ద్వారా చిత్తూరు-నెల్లూరు కేంద్రంగా పరిశ్రమలకు కావలసిన నీటి అవసరాలపై ఎపి ప్రభుత్వం దృష్టి సారించింది. పరిశ్రమలకు కావలసిన నీటి అవసరాలకు సంబంధించి డీపీఆర్ తయారు దిశగా సమాలోచన చేయాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కోరారు. ఏపీ టెక్సట్ టైల్స్, గార్మెంట్స్ పాలసీ 2018-23 ఆపరేషనల్ గైడ్ లైన్స్, ఐఎస్ బీతో భాగస్వామ్యం పై ఆరా తీశారు. ఎక్స్‌పోర్ట్‌లపై పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశానికి పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి, పరిశ్రమల శాఖ సలహాదారు శ్రీధర్ లంకా, ఐటీ శాఖ సలహాదారులు శ్రీనాథ్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, లోకేశ్వరరెడ్డి, తదితరులు హాజరయ్యారు.













