అంగరంగ వైభవంగా శ్రీవారి రథోత్సవం
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన ఉభయదేవేరులతో మలయప్ప స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మోరుమోగాయి. శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలతో కూడిన రథంపై వివాహరించాడు. తిరుమలలో రథోత్సవం అన్ని విధాలా ప్రసిద్దమైంది. రథస్తం కేశవం దృష్టా పునర్జన్మనవిద్యతే అన్న ఆర్ష హక్కులు రథోత్సవం మోక్షప్రదాయకమని వివరిస్తూన్నాయి. తిరుమాడవీధులలో రథాన్ని లాగేటపుడు ప్రమాదాలు జరగకుండా అధికారులు తగిన జాగ్రతలు తీసుకున్నారు. రథానికి తాళ్ళు కట్టి భక్తులు ముందుకు లాగారు. ఈ కార్యక్రమంలో జీయంగార్లు, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ఏవీ.ధర్మారెడ్డి, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహకిషోర్, బోర్డు సభ్యులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.













