ఎన్నికల సంఘంపై ఢిల్లీలో టీడీపీ ధర్నా
ఎన్నికల సంఘంపై ఢిల్లీలో ధర్నాకు సన్నద్ధమవుతున్నామని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మోడీ కోడ్ ఆఫ్ కండక్ట్‌గా మారిపోయిందని, న్యాయ వ్యవస్థనూ నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వారణాసిలో మోడీ నామినేషన్ వ్యవహారం వీడ్కోలు వేడుకను తలపించిందన్నారు. వీవీ ప్యాట్లపై జాతీయ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడంలో చంద్రబాబు విజయం సాధించారని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఏపీ సీఎస్‌పై విమర్శలు గుప్పించారు. ప్రజా సమస్యలపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.













