అధికారంలోకి వచ్చాక ఆ హామీని రద్దు చేశారు
ప్రతిపక్షంలో పేదల ఇళ్ల పైన రుణాలు రద్దు చేస్తామన్న వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఆ హామీని రద్దు చేశారని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. ఈ సంద్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వన్ ఛాన్స్ అంటూ వచ్చి, కలెక్షన్స్ కోసం పేదలను వన్ టైమ్ సెటిల్మెంట్ అంటూ వన్ టైమ్ సీఎంగా జగన్ మిలిగి పోబోతున్నారని అన్నారు. ఎప్పుడో పుట్టిన పిల్లవాడికి అతని పెళ్లి సమయంలో బారసాల చేసినట్టు జగన్ పాలన తీరు ఉందన్నారు. పేదల గృహాల పైన ఓటీఎస్ ఐచ్ఛికం అనే వారు ఇష్టారాజ్యంగా బలవంతపు వసూళ్లు ఏందుకు? అని ప్రశ్నించారు. పథకాల రద్దు బెదిరింపుల మాటేమిటి? ఆస్తి హక్కు పత్రాల పైన హక్కుదారుల ఫోటో ఉండాలి కాని జగన్ ఫోటో కాదన్నారు. రాష్ట్రంలో అందరి ఆస్తులకు ఆయనే హక్కుదారు కావాలను కుంటున్నారా? ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు జగన్ పాలనకి వన్ టైమ్ సెటిల్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.













