రాష్ట్రంలో ఇప్పుడు పనిచేసే సీఎంను… గతంలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబును చూస్తున్నామని, గతంలో పని చేయడం తెలియని జగన్ సీఎంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో రాష్ట్రంలో ఇప్పుడు నిలబడి పని చేసే జలవనరుల శాఖ మంత్రిని చూస్తున్నాం. గతంలో పంచాయతీలకు నిధులివ్వని మంత్రిని చూశాం. ఇప్పుడు నికార్సయిన పంచాయతీరాజ్ మంత్రిని చూస్తున్నాం. ఇప్పుడు వెంటనే స్పందించే విద్యాశాఖ మంత్రి ఉన్నారు. గతంలో విద్యను అమ్ముకున్న వ్యక్తి మంత్రిగా ఉన్నారు. ఓపికతో పనిచేస్తున్న వైద్య, ఆరోగ్య మంత్రిని ఇప్పుడు చూస్తున్నాం. గతంలో నిస్సహాయ మంత్రిని చూశాం అని విమర్శించారు.













