రాష్ట్రంలో ఐదేళ్లుగా అరాచక పాలన : లంకా దినకర్
ముఖ్యమంత్రి జగన్ విశ్వాస ఘాతుకానికి ట్రేడ్‌మార్క్ అని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదేళ్లుగా అరాచక, విధ్వంసక పాలన చూశామన్నారు. నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడి కలబోతే జగన్ అని అన్నారు. త్రిమూర్తుల కలయికతో రాక్షస పాలన సంహారం తథ్యమని తెలిపారు. సీఎం తట్టా బుట్టా సర్దుకుని నచ్చిన ప్యాలెస్‌కు వెళ్లడం మంచిదని అన్నారు. ఒకసారి వైసీపీకి ఓటు వేస్తే రాష్ట్రం రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పుడు మరోసారి ఓటు వేస్తే శతాబ్దం వెనక్కి పోతుంది. 2019కి ముందు అమరావతే రాజధాని అంటూ 2024 నాటికి నిర్వీర్యం చేశారు. మద్యం నిషేదం అంటూనే దాన్నే ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ సర్కార్ అంటూనే వారిని బానిసలకన్నా హీనంగా చూస్తున్నారు. నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అంటూ ఉప ప్రణాళిక నిధులు గోల్మాల్ చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులు, పథకాలను పేర్లు మార్చిన జగన్ స్టిక్కర్లు వేసుకున్నారు. గడిచిన ఐదేళ్లలో కేంద్రం పంపించే నిధులకు బటన్ నొక్కడం తప్ప ఏం చేయలేదు. రాష్ట్రానికి రూ.12 లక్షల కోట్ల అప్పులకు చేర్చిన ఘనత ఆయనకు దక్కింది అని మండిపడ్డారు.













