సీఎం కేసీఆర్ ఆ విషయం చెప్పాలి
బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలను తెలంగాణ సీఎం కేసీఆర్ కలవడంపై తెలుగుదేశం పార్టీ నేత లంకా దినకర్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేజీకి గతం కంటే ఈసారి 100 సీట్లు తగ్గుతాయన్నారు. కేసీఆర్ ఎన్డీఏ పక్షాల దగ్గరికి వెళ్లకుండా..బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలను ఎందుకు కలుస్తున్నారని నిలదీశారు. కేసీఆర్ ముసుగు తొలగించాలని.. ఆయన వెంట జగన్ తప్ప ఎవరూ లేరని పేర్కొన్నారు. కేసీఆర్ మహాకూటమి నేతలను కలిసేటప్పుడు తాను అసలు మోదీకి వ్యతిరేకమా? కాదా? అనేది తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు.













