రివ్వూ చేసేటప్పుడు సీఎంను ఎందుకు ఆహ్వానించలేదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం రాజ్యాంగ నిబంధనలను కాలరాస్తున్నారని టీడీపీ నేత లంకా దినకర్ ఆరోపించారు.ఈ సందర్భంగా ఆయన మీడియతో మాట్లాడుతూ శాఖలపై రివ్వూ చేసేటప్పుడు సీఎంను ఎందుకు ఆహ్వానించడంలేదని ప్రశ్నించారు. సీఎస్ చర్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు సీఎం అవుతారనే విషయాన్ని ప్రస్తావించి.. సీఎస్ స్థానాన్ని దిగజారుస్తున్నారని విమర్శించారు. కేర్ టేకర్‌గా ఉన్న అధికారి ఇష్టానుసారం ప్రవర్తించడం సరికాదని లంకా దినకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కడప జిల్లాలో వడగాళ్లవాన పడి రైతులు ఇబ్బంది పడుతుంటే సీఎస్ ఏం చర్యలు తీసుకున్నారని విమర్శించారు. ఇక్కడ అధికారులు ఎంతో బాగా పనిచేయబట్టే రాష్ట్రం అభివృద్ధి సాధించగలిగిందని అన్నారు.













