ఈసారి అధికార ప్రతినిధి వంతు
తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఎన్నికలకు ముందు వెనుకా కాస్త గట్టిగానే గళం వినిపించిన టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ బీజేపీలో చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో లంకా కాషాయ కండువా కప్పుకున్నారు. కాగా, తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపించారు. లంకా దినకర్ కొంత కాలంగా టీడీపీ తరపున శక్తి మేర గొంతుక వినిపించారు. అనేక అంశాలపై ఆయన టీడీపీ వైఖరిని చాటడమే కాకుండా, ప్రత్యర్థి పార్టీల విమర్శలకు దీటుగా బదులు ఇచ్చేవారు.













