విజయవాడలో లలితా జువెలరీ షోరూం ప్రారంభం
లలితా జువెలరీ ఆసియాలోనే అతిపెద్ద షోరూమ్‌ను విజయవాడలో ఏర్పాటు చేయడం గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్రంలో మరిన్ని షోరూమ్‌లు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. విజయవాడలో లలితా జువెలరీ షోరూమ్‌ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల ఆదాయం పెరిగిందని, పెరిగిన ఆదాయంలో పొదుపుతోపాటు కొంత మేర ఖర్చు పెట్టుకునే స్థాయికి జీవన ప్రమాణం మారిందన్నారు. పొదుపు చేసిన పెట్టుబడుల విలువ పెంచుకునేందుకు బంగారం కొనుగోలు మంచి మార్గమన్నారు. దీనివల్ల లలితా జువెలరీ అధినేత కిరణ్ కుమార్ వ్యాపారం పెరిగి జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి పన్నుల ఆదాయం సమకూరుతుందన్నారు.
కష్టపడి సంపాదించిన సొమ్మును భద్రంగా దాచుకునేందుకు బంగారం కొనుగోలు మంచి మార్గమని లలితా జువెలరీ అధినేత ఎం కిరణ్ కుమార్ అన్నారు. వినియోగదారుడు ఖర్చు చేసే ప్రతి రూపాయికి నమ్మకమైన, కచ్చితమైన తూకంతో, దాపరికం లేని చార్జీలతో నగలు విక్రయించడమే తమ విజయానికి కారణమన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఫిలిం, టెలివిజన్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంబికా కృష్ణ, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.













