బాబు, బాలకృష్ణ ను టార్గెట్ చేసిన లక్ష్మీపార్వతి..
ఆంధ్రాలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరొకసారి లక్ష్మీపార్వతి వైసీపీ కు మద్దతుగా చంద్రబాబు, బాలకృష్ణను టార్గెట్ చేశారు. చంద్రబాబుకి వ్యతిరేకంగా కుప్పంలో, బాలయ్యకు వ్యతిరేకంగా హిందూపురంలో విస్తృత ప్రచారం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యం లో చంద్రబాబు, బాలయ్యను ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇటీవల కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన లక్ష్మీ పార్వతి అధికారం కోసం బాబు ఎదురు చూస్తున్నారని.. పొరపాటున మరొకసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేస్తారని చెప్పారు. పొరపాటున టీడీపీ అధికారంలోకి వస్తే పథకాలు ఆగిపోతాయన్నారు. ఇటు హిందూపురం నియోజకవర్గం లో కూడా పర్యటించిన ఆమె బాలకృష్ణ ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బాలకృష్ణ పై అభిమానం ఉంటే.. అది సినిమాల వరకే పరిమితం చేసుకోవాలని.. అభివృద్ధి కావాలి అంటే సరియైన నాయకుడు ఎంచుకోవాలని అన్నారు. వెన్నుపోటు ఎపిసోడ్ తర్వాత సొంత తల్లికి అండగా నిలబడి బాలకృష్ణ.. హిందూపురం ప్రజలకు ఏ రకంగా అండగా నిలబడతారని ప్రశ్నించారు.













