శ్రీశైలంలో లక్ష దీపోత్సవం
శ్రీశైలంలో తొలి కార్తీక సోమవారం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున 2:30 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి సుప్రభాత సేవ, మహా మంగళ హారతి సేవలను ఏకాంతంగా నిర్వహించారు. తర్వాత శ్రీస్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులను అనుమతించారు. ఉదయం 5:30 గంటలకు, మధ్యాహ్నం 12:30 గంటలకు విశేష సంఖ్యలో భక్తులు శ్రీమల్లికార్జునస్వామికి సామూహిక రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన పూజలు జరిపించుకున్నారు. ఉచిత దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పట్టింది. సాయంత్రం ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం వైభవంగా జరిగింది. శ్రీస్వామి అమ్మవార్లకు, పుష్కరిణికి ఓంకార, నాగ, త్రిశూల, నంది, సింహ, సూర్య, చంద్ర, కుంభ, నక్షత హారతులను శాస్త్రోక్తంగా సమర్పించారు.













