మంత్రి లోకేశ్ చొరవతో.. కువైట్ నుంచి స్వస్థలానికి చేరుకున్న శివ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చొరవతో కువైట్ నుంచి శివ స్వస్థలానికి చేరుకున్నారు. కువైట్‌లో తన కష్టాలపై తెలుగు కార్మికుడు శివ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎక్స్‌లో వీడియో పెట్టిన విషయం తెలిసిందే. తనకు సాయం చేయకపోతే చావే శరణ్యమని శివ వేడుకున్నారు. ఈ వీడియో చూసిన మంత్రి లోకేశ్ వెంటనే స్పందించారు. టీడీపీ ఎన్ఆర్ఐ బృందానికి అతడిని ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొచ్చే బాధ్యత అప్పగించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో బాధితుడిని ఏపీకి తీసుకొచ్చే వరకు మంత్రి స్వయంగా పర్యవేక్షించారు. బుధవారం శివ అతడి స్వస్థలం మదనపల్లికి చేరుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.













