ఏపీలో మహిళా కూలీకి వజ్రం లభ్యం

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో పొలం పనులకు వెళ్లిన ఓ మహిళా కూలీకి వజ్రం లభ్యమైంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరికి చెందిన ఓ మహిళ పొలంలో కూలి పనులుకు వెళ్లింది. అక్కడ పనులు చేస్తుండగా వజ్రం లబ్యమైనట్లు సమాచారం. నాలుగున్నర క్యారెట్లు ఉన్న ఆ వజ్రాన్ని అదే గ్రామానికి చెందిన వ్యాపారి రూ.6.50 లక్షలు, 2 తులాల బంగారమిచ్చి కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో ఏటా తొలకరి వర్షాలకు వజ్రాలు లభ్యమవడం సహజం.