కర్నూల్ లో టీడీపీ కు బై బై చెప్పనున్న కేఈ..
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో టీడీపీ కి మరో షాక్ తగిలింది. కర్నూలు జిల్లాలో టీడీపీ తరఫున ముఖ్యమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న కేఈ ప్రభాకర్ పార్టీకి దూరం కాబోతున్నారు. పార్టీకి రాజీనామా ఇచ్చి తన కొడుకు కేఈ రుద్ర సూచన ప్రకారం వైసీపీ లో చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు తనని పట్టించుకోవడంలేదని.. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పిన ప్రభాకర్.. ఆ కారణం వల్లే పార్టీ వీడుతున్నట్టు పేర్కొన్నారు. సంవత్సరాలు తరబడి పార్టీని నమ్ముకుని పని చేసిన తాము.. ఎక్కడి నుంచో వచ్చిన వారి కోసం పని చేయాలా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక వైసీపీ లో చేరికపై త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.టీడీపీ తరఫున పత్తికొండ సీటును ఆయన సోదరుడు మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కొడుకు శ్యాం బాబుకి కేటాయించారు. అయితే కేఈ డోన్ శాసనసభ స్థానాన్ని ఆశించారు. కానీ కుటుంబానికి ఒక సీటే కేటాయించడానికి నిర్ణయించుకున్న అధిష్టానం దీనికి ఒప్పుకోలేదు. దీంతో ప్రభాకర్ పార్టీ నుంచి తప్పుకోవడానికి నిర్ణయించుకున్నారు.ప్రభాకర్ పార్టీని వీడుతున్నారు అంటే టీడీపీ కు ఉమ్మడి కర్నూలు జిల్లాలో బలమైన కేఈ కుటుంబం దూరమైనట్టే లెక్క. పార్టీ నుంచి ఆశించిన టికెట్ రాకపోవడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.కేఈ నిజంగా వైసీపీ లోకి వెళ్తే కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. మరి నేపథ్యంలో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి..













