Modi: ప్రధాని మోదీ కర్నూలు పర్యటన.. షెడ్యూల్ ఇదే!

ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) కర్నూలు జిల్లా పర్యటనకు సంబంధించి పీఎంవో (PMO) అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 16న ప్రధాని కర్నూలు (Kurnool) జిల్లాలో పర్యటించనున్నారు. అనంతరం శివాజీ (Shivaji) స్పూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత కర్నూలులో సుమారు రూ.13,430 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. రూ.2,880 కోట్లతో చేపట్టనున్న కర్నూలు -3 పూలింగ్ స్టేషన్‌ని అనుసంధానం చేసే ట్రాన్స్‌మిషన్ వ్యవస్థకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.