సైనిక్ స్కూల్ విద్యార్థికి కర్నూలు ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ ఆర్థిక సహాయం.
రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కలికిరి సైనిక్ స్కూల్ నిర్వహించిన ప్రవేశపరీక్ష లో ఎంపికైన విద్యార్ధి జి. వినయ్ కుమార్ కు మొదటి సంవత్సరం ఫీజు నిమిత్తం కర్నూలు ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ అందించింది. శుక్రవారం ఆగష్టు 20 నాడు కర్నూలు డీఎస్పీ (సిఐడి) రవి కుమార్ విద్యార్ధి వినయ్ కుమార్ కు చెక్కును అందజేశారు. ఆర్ధిక ఇబ్బందుల వలన ప్రతిభావంతులైన విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా అందిస్తున్న ఆర్ధిక సహాయం స్ఫూర్తిదాయకమని, కర్నూలు ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ సేవలని అభినందిస్తున్నట్లు డీఎస్పీ రవి కుమార్ తెలిపారు.
కర్నూలు జిల్లా కొత్తకోట గ్రామానికి చెందిన విద్యార్ధి, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సైనిక్ స్కూల్ నిర్వహించిన ప్రవేశపరీక్షలో పాల్గొని సీటు సాధించడం గర్వకారణమని, ప్రతిభావంతులైన విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యనందించాలనే లక్ష్యంతో ఫౌండేషన్ ద్వారా ఆర్ధిక సహకారం అందజేస్తున్నట్లు కర్నూలు ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవి పొట్లూరి తెలిపారు. డిఎస్పీ శ్రీనివాసులు, సీఐ డేగల ప్రభాకర్, ముప్పా రాజశేఖర్ సందడి మధు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.













