Modi: ప్రధాని మోదీ పర్యటనపై .. మంత్రుల సమీక్ష

ప్రధాని మోదీ (Modi) పర్యటన నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు సమీక్షించారు. కర్నూలు (Kurnool) లోని ఓ ప్రైవేటు హోటల్‌లో రవాణాశాఖ అధికారులతో మంత్రులు నారాయణ (Narayana), బీసీ జనార్దన్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాదరెడ్డి సమావేశమయ్యారు. బస్సుల ఫిట్‌నెస్, సభా ప్రాంగణంలో పార్కింగ్ ఏర్పాట్లు, సభకు భారీగా తరలివచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా పికప్, డ్రాపింగ్ వంటి అంశాలపై దృష్టిసారించాలని అధికారులను మంత్రులు (Ministers) ఆదేశించారు. ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా సకాలంలో సభావేదికకు బస్సులు (Buses) చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, కర్నూలు రీజినల్ ఆర్టీసీ చైర్మన్ నాగరాజు, రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు.