కాణిపాకం ఆలయంలో ఘనంగా కుంభాభిషేకం చివరి రోజు కార్యక్రమాలు
స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం
శ్రీ స్వామివారి దేవస్థానం చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకం లో భాగంగా తేదీ 21.08 2022 న చివరి రోజు మహాపూర్ణాహుతి, కలశోద్వాసన, రాజగోపురం, పశ్చిమ రాజగోపురం, స్వామి వారి విమాన గోపురం, నూతన ధ్వజస్తంభమునకు మహా కుంభాభిషేకము నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ఎమ్మెస్ బాబు గారు, దేవస్థానం చైర్మన్ శ్రీ మోహన్ రెడ్డి గారు, దేవస్థానం కార్యనిర్వహణధికార శ్రీ సురేష్ బాబు గారు, ఆలయ పునర్నిర్మాణ దాతలు ఐకా రవి గారు, గుత్తికొండ శ్రీనివాస్ గారు, మరియు వారి కుటుంబ సభ్యులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు, ఆలయ ఉభయదారులు, ఆలయ ఏ ఈ ఓ లు, పర్యవేచ్చకులు, అర్చకులు వేద పండితులు, తదితరులు పాల్గొన్నారు.













