కాణిపాకం ఆలయంలో ఘనంగా కుంభాభిషేకం 3వ రోజు కార్యక్రమాలు
శ్రీ స్వామివారి దేవస్థానం చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకం లో భాగంగా తేదీ 17.08.2022 మూడవ రోజు ఉదయం చతుర్వేదపారాయణ, చతుర్వేద హవనం, కలశాధారణ, నీరాజన మంత్రపుష్పం, మొదలగును పూజలను నిర్వహించడం జరిగింది, సాయంత్రం విమాన గోపుర నూతన కలశం శివాలయం నుండి మాడా వీధుల్లో ప్రదక్షణ తీసుకొని వచ్చి ప్రధాన ఆలయం యాగశాల పూజల యందు ఉంచడం జరిగింది, తర్వాత యాగశాల నందు పూజలు అనుజ్ఞ, ప్రవేశ బలి, రచ్చోగ్య హోమము, వాస్తు శాంతి, మొదలుకొని పూజలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పూతలపట్టు శాసనసభ్యులు శ్రీ ఎమ్మెస్ బాబు గారు, దేవస్థానం చైర్మన్ శ్రీ మోహన్ రెడ్డి గారు, దేవస్థానం కార్యనిర్వహణధికార శ్రీ సురేష్ బాబు గారు, ఆలయ పునర్నిర్మాణ దాతలు ఐకా రవి గారు, గుత్తికొండ శ్రీనివాస్ గారు, మరియు వారి కుటుంబ సభ్యులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు,ఈఈ వెంకట నారాయణ, ఏఈఓ లు విద్యాసాగర్ రెడ్డి, కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరి మాధవరెడ్డి, ఆలయ పర్యవేచ్చకులు, అర్చకులు వేద పండితులు, తదితరులు పాల్గొన్నారు.













