కాణిపాకం ఆలయంలో ఘనంగా కుంభాభిషేకం 2వ రోజు కార్యక్రమాలు
స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం
శ్రీ స్వామివారి దేవస్థానం చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకం లో భాగంగా తేదీ 16.08.2022 రెండవ రోజు ఉదయం వేద స్వస్తి, యాగశాల ప్రవేశం, కలశ స్థాపన, గణపతి హోమం, చతుర్వేద హవనం, మంత్రపుష్పం, మొదలగు పూజలను నిర్వహించడం జరిగింది, సాయంత్రం చతుర్వేద పారాయణం, కలశధారణ, లఘు పూర్ణాహుతి, నీరాజన మంత్రపుష్పము, మొదలుకొని పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ పునర్నిర్మాణ దాతలు ఐకా రవి గారు, గుత్తికొండ శ్రీనివాస్ గారు, మరియు వారి కుటుంబ సభ్యులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు, పూజలు అనంతరం దాతలు నూతన ఆలయాన్ని పరిశీలించారు. ఈఈ వెంకట నారాయణ, ఏసీ కస్తూరి, ఏఈఓ కృష్ణారెడ్డి, ఆలయ పర్యవేచ్చకులు కోదండపాణి, శ్రీనివాస్, అర్చకులు వేద పండితులు, తదితరులు పాల్గొన్నారు.













