KTR : ఆ పార్టీ అధికారంలోకి వస్తే.. రైతుబంధుకు రాం రాం
ఆనాడు నిజాం సర్కారును నిలదీసిన గడ్డ నల్గొండ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. నల్గొండ క్లాక్‌టవర్ కూడలిలో బీఆర్ఎస్(BRS) రైతు మహా ధర్నా (Dharna) నిర్వహించారు. తొలుత నాగార్జున కళాశాల (Nagarjuna College )వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి కేటీఆర్ నివాళులర్పించారు. అక్కడి నుంచి క్లాక్ టవర్ (Clock Tower) వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ఈ జిల్లాకు మాజీ సీఎం కేసీఆర్ ఏం చేశారని అసెంబ్లీలో ఓ మంత్రి అడిగారన్న ఆయన, వరి ఉత్పత్తిలో జిల్లాను నెంబర్ వన్ చేశారని తెలిపారు. రైతు బంధు కింద కేసీఆర్ ప్రభుత్వం రైతులకు రూ.73 వేల కోట్లు ఇచ్చింది. నల్గొండ బిడ్డలు జీవచ్ఛవంగా మారడానికి కారణం కాంగ్రెస్. ఆ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాం రాం అవుతుందని కేసీఆర్ ఎప్పుడో చెప్పారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా రైతుబంధు నిధులు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది అని కేటీఆర్ విమర్శించారు.













