జగ్గయ్యపేటలో క్రిమికాలుష్యనివారణ శ్రౌత మహాయాగం
ఆంధప్రదేశ్‌లోని జగ్గయ్యపేట మండలం వేదాద్రి గోశాలలో వేదాస్ వరల్డ్ అట్లాంటా వారి సహకారంతో గోశాల వారి నిర్వహణలో లోకకళ్యాణార్థం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు క్రిమి కాలుష్య నివారణ శ్రౌత మహాయాగం నిర్వహిస్తున్నారు. 17వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ఈ యాగం ప్రారంభమవుతుంది. ప్రతిరోజు సూర్యోదయం నుంచి 3 గంటలు, సూర్యాస్తమయానికి ముందు 2 గంటలపాటు ఈ యాగం జరుగుతుంది. ఈ యాగానికి అందరూ రావచ్చు. 15రోజులపాటు జరిగే ఈ యాగాన్ని ఫేస్బుక్ ద్వారా కూడా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఆంధప్రదేశ్‌లో పెరిగిన కరోనా కేసుల నేపథ్యంలో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నామని, ఈ యాగం నిర్వహణ ద్వారా దైవానుగ్రహం చేత కరోనా నుంచి విముక్తి లభించవచ్చని ఆశిస్తున్నట్లు వేదాస్ వరల్డ్ ప్రెసిడెంట్ వెంకట్ చాగంటి తెలిపారు. ఇతర వివరాలకు, లైవ్ లింక్ కోసం ఇన్విటేషన్‌ను చూడండి.
http://www.vedas.us/index.html














