బీజేపీలోకి కొత్తపల్లి గీత!
అరకు మాజీ ఎంపీ, జాన జాగృతి పార్టీ అధ్యక్షురాలు కొత్తపల్లి గీత భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆమె నెలకొల్పిన జన జాగృతి పార్టీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమచారం. జనజాగృతి పార్టీని బీజేపీలో విలీనం చేసి, ఆ పార్టీలో ప్రాధాన్యత కలిగి పదవిని తీసుకోవాలని ఆమె భావిస్తున్నారు. ఈ మేరకు నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి హామీ తీసుకునేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. ప్రధాన మంత్రితో ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా ఖరారైందని ఆమె కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.













