మంత్రి అమర్ నాథ్ తో కొరియా ప్రతినిధుల బృందం భేటీ
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నేతృత్వంలో కొరియా అధికారులు ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ను సర్క్యూట్ హైస్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకుంది. విశాఖపట్నంలో ఫుడ్ ప్రాసెసింగ్, టెక్టైల్స్, ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటులో ఏ విధంగా సహకారాన్ని అందిస్తారన్న అంశంపై చర్చించామని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకున్న వారు ముందుగా ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుంటారని, పారిశ్రామికవేత్తలను ఆకర్షించే విధంగా ఉన్న రాష్ట్ర పారిశ్రామిక విధానం ఇందుకు కారణం అని కొరియా ప్రతినిధులు పేర్కొన్నట్లు అమర్నాథ్ తెలిపారు. ఇదిలా ఉండగా వర్తక వాణిజరంగంలో ఆంద్రప్రదేశ్ సౌత్ ఏషియాకు ముఖద్వారంగా నిలిచిందని మంత్రి కొరియా బృందానికి వివరించారు. ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు మరింత బలపడాలని మంత్రి ఆకాక్షించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు.













