విజయవాడ సెంట్రల్ బరిలో టీఆర్ఎస్!
టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు విజయవాడకు చెందిన కొణిజేటి ఆదినారాయణ తెలిపారు. ఆదినారాయణ తొలినుంచి కేసీఆర్‌కు వీరాభిమాని. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించాలని ఇంద్రకీలాది వద్ద 101 కొబ్బరికాయలతో మొక్కు తీర్చుకున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మోకాళ్లపై ఇంద్రకీలాద్రి ఎక్కారు. తాజాగా ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఆదినారాయణ విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలని సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని అధిష్ఠానానికి తెలిపానని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి కేటీఆర్‌ను తీసుకొస్తాననీ, తెలంగాణ ఎంపీ అభ్యర్థులతో పాటే తాను కేసీఆర్ నుంచి బీఫారం తీసుకుంటానని ఆదినారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నారు.













