Minister Kondapalli : అనర్హులకు మాత్రమే నోటీసులు : మంత్రి కొండపల్లి

అర్హులకు పింఛన్లు ఎక్కడా తొలగించలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) స్పష్ట చేశారు. లబ్ధిదారులు ఎవరైనా చనిపోతే వెంటనే ఆ కుటుంబంలో మరొకరికి ఇస్తున్నామని తెలిపారు. అనర్హులకు మాత్రమే నోటీసులు (Notices) ఇస్తున్నామని చెప్పారు. పింఛను పథకంపై శాసన మండలి (Legislative Council ) లో ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 50-59 ఏళ్ల మధ్య ఉన్న 11,98,501 మంది పింఛను పొందుతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పేదలకు ఇచ్చే పింఛన్లను రూ.3 వేల నుంచి రూ.4వేలకు ఒకేసారి పెంచామన్నారు. అనర్హులకు నోటీసులు ఇచ్చి 2 నెలల్లో రీ వెరిఫికేషన్ (Re-verification) చేయాలని వైద్యశాఖకు సూచించామని తెలిపారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వం పింఛన్లు ఇస్తోందన్నారు.