ప్రపంచంలోనే ఇదే ప్రథమం… ఒకే కేటగిరిలో భార్య, భర్తకు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి లోని స్థానిక గరవపాలెంకు చెందిన కొణతాల విజయ్ ఆయన సతీమణి ఇరువురు కూడా ప్రపంచ గిన్నిస్ బుక్‌లో రికార్డు సృష్టించారు. దీనిని యోగ కేటగిరిలో ఆసనాలు వేయడం ద్వారా ఈ ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డ్ నెలకొల్పాడు. బహుశా ప్రపంచంలోనే ఒక కేటగిరిలో భార్య, భర్త ఇద్దరు కూడా గిన్నిస్ బుక్ లో రికార్డు నెలకొల్పడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా కొణతాల విజయ్ మాట్లాడుతూ తాను ఆంధ్రాలో పెట్టినప్పటికీ తెలంగాణలో తనకు మొట్టమొదటిగా సెటిల్మెంట్ లభించిందన్నారు. అక్కడే సినిమారంగానికి సంబంధించిన కొరియోగ్రాఫర్ బృందంలో మెంబర్షిప్ తీసుకున్నానని, అదే విధంగా అసిస్టెట్ కొరియోగ్రాఫర్‌గా కూడా పని చేశానని తెలిపారు. ఇలా పనిచేస్తూ అనేక టీవీ డ్యాన్స్ ప్రోగ్రాంలలో, విజయ్ గ్రూప్ ద్వారా పాల్గొని, అందులో ఎన్నో విజయాలు సాధించారని తెలిపారు. ఈ క్రమంలో తను నమ్మే దైవం, తన గురువు మెగాస్టార్ చిరంజీవి అని, ఆయన డాన్సులు, చిత్రాలూ చూస్తూనే పెరిగానని, చిరంజీవే తనకి గురువు దైనం అని కొనియాడారు.













