టీడీపీలోకి మాజీ మంత్రి?
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తేదీని ఖారరు చేశారని తెలిసింది. ఆయన ఈ నెల 17న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకోబోతున్నారని సమాచారం. కొణతాలకు అనకాపల్లి లోక్సభ టికెట్ ఇవ్వబోతున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అనకాపల్లి లోక్సభకు ముగ్గురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అందులో మొదటి పేరు కొణతాల రామకృష్ణదే. మరొకరు విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుమారుడు ఆడారి ఆనంద్. మూడో వ్యక్తి అయ్యన్న కుమారుడు విజయ్. అయితే కొణతాలకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.













