ఇది నా అత్తగారి గ్రామంగా భావిస్తున్నా..: సీఎం చంద్రబాబు
కొమరవోలు గ్రామాన్ని 10 స్టార్స్ గ్రామంగా ప్రకటిస్తున్నామని, ఎక్కడ ఉన్నా పుట్టిన ఊరును మర్చిపోవద్దని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నారా భువనేశ్వరి దత్తత తీసుకున్న గ్రామం కొమరవోలు పర్యటనకు చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి వచ్చారు. రూ.10 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీరామారావు సతీమణి బసవతారకం.. తన పిల్లల బాగోగులు చూసుకోవడమే కాకుండా రామారావు బాగోలు కూడా ఆమె చూసేవారని, ఆయన అన్ని విజయాలు సాధించారంటే ఆయన వెనుక బసవతారకం కృషి సహకారం ఎంతో ఉందని, ఇది తన అత్తగారి గ్రామంగా భావిస్తున్నానని అన్నారు. భవిష్యత్తులో కూడా కొమరవోలు గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.













