అక్టోబర్ 1 నుంచి కొత్త పాలసీ : మంత్రి కొల్లు
గత వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసిందని ఆంధ్రప్రదేశ్ అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సొంత ఆదాయం పెంచుకునేలా ఆదాయానికి గండి కొట్టేలా గత ప్రభుత్వం మద్యం పాలసీని అమలు చేసిదని మండిపడ్డారు. నాటి మద్యం పాలసీ కారణంగా ప్రజల ఆరోగ్యం నాశనమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త మధ్యం పాలసీ రూపకల్పనపై కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం జరిగిందని తెలిపారు. మంచి మద్యం పాలసీని త్వరలోనే తీసుకొస్తామని తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త పాలసీని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఆరు రాష్ట్రాల్లోని మద్యం పాలసీలను అధ్యయనం చేస్తున్నామన్నారు. తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందించేలా పాలసీ రూపొందించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ విధానాలు, నాసికరం మద్యం కారణంగా రాష్ట్రంలో గంజాయి వినియోగం పెరిగిందని ఆరోపించారు.













