2019లో జాతీయ క్రీడల నిర్వహణకు ప్రణాళిక
2019లో జరిగే జాతీయ క్రీడలను అమరావతి కేంద్రంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసిందని రాష్ట్ర యువజన, క్రీడాశాఖా మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. మంగళవారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగే 51వ ఆంధ్రప్రదేశ్ రాష్టస్థ్రాయి సీనియర్ పురుషుల, మహిళల ఖోఖో పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ సభలో మంత్రి కొల్లు మాట్లాడుతూ రాష్ట్ర సాంప్రదాయ క్రీడ ఖోఖోకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని క్రీడా హబ్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక పెట్టారన్నారు. దీనిలో భాగంగా తిరుపతి, అమరావతి, విశాఖపట్నం నగరాలను క్రీడా నగరాలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కూడా క్రీడలకు అత్యంత ప్రాధాన్యమివ్వడంతో పాటు క్రీడాకారులకు సముచిత స్థానాన్ని కల్పిస్తూ ప్రోత్సాహకాలను అందజేస్తున్నామన్నారు.













