ఇది అంబేద్కర్ రాజ్యాంగమా?.. రాజారెడ్డి రాజ్యాంగమా?
విజయవాడలోని మాచవరం దేవాలయానికి వెళ్లే ప్రయత్నం చేసిన మాజీ మంత్రి కొలు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు కొల్లు రవీంద్ర మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాలయానికి వెళ్లడానికి పోలీస్ పర్మిషన్ తీసుకోవాలా అని ప్రశ్నించారు. జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. ఇది అంబేద్కర్ రాజ్యాంగమా? లేదా రాజారెడ్డి రాజ్యాంగమా? అని ప్రశ్నించారు. తనను హౌస్ అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. ఎటువంటి నోటీస్ అందజేయకుండా మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు వీల్లేదని చెబుతున్నారు. అసలు ఏ హక్కుతో తనను అడ్డుకుంటున్నారని పోలీసులపై కొల్లు ఫైర్ అయ్యారు.













