Kollu Ravindra: చంద్రబాబు విజన్‌పై మాట్లాడే అర్హత.. ఆయనకు లేదు : మంత్రి కొల్లు
విజన్ గురించి ప్రిజనరీకి ఏం తెలుస్తుందని జగన్‌ను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ దోచుకోవడం, దాచుకోవడంలో జగన్(Jagan) ను మించినోళ్లు లేరని ఎద్దేవా చేశారు. విజన్ 2020ని ఎగతాళి చేసినోళ్లే నేడు ఫలితాలు అనుభవిస్తున్నారని తెలిపారు. ఉద్యోగాల గురించి మాట్లాడే జగన్, సైబరాబాద్ (Cyberabad) చూసి తెలుసుకోవాలి. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ ఉద్యోగమూ భర్తీ చేయలేదు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన చరిత్ర జగన్‌ది. చంద్రబాబు (Chandrababu) విజన్‌పై మాట్లాడే నైతిక అర్హత ఆయనకు లేదు. రాష్ట్రానికి జగన్ చేసిన ద్రోహాన్ని గుర్తించిన ఏ ఒక్కరూ క్షమించరు అని మండిపడ్డారు.













